పసుపు-కుంకుమ నిధులు ఆపేందుకు ఆఖరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం, న్యాయస్థానాల్లో కొద్ది రోజులుగా పలువురు పిటిషన్లు వేస్తున్నారు. అన్ని పిటిషన్లను ఈసీ, న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. నేడు దిల్లీ హైకోర్టులో జనచైతన్యవేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.
పసుపు - కుంకుమ పథకం అమలుపై దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది విన్పించిన వాదనను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్నందున... లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు పంపడం ఈసీ కోడ్ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది.