ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేనలో ముఖ్య కమిటీల ఏర్పాటు..!

జనసేనలో నూతనోత్సాహాన్ని నింపే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. దీనిలో భాగంగానే పార్లమెంట్ స్థాయి పరిధిలో కమిటీలను ప్రకటించేందుకు సమాయత్తమయ్యారు.

పవన్ కల్యాణ్

By

Published : Jun 23, 2019, 8:06 PM IST

Updated : Jun 24, 2019, 3:32 AM IST

క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసేన కొత్త కమిటీలు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కొత్త కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ప్రకటించనున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ, స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ, రాజధాని అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీలు ఇందులో ఉంటాయని పార్టీ ప్రకటనలో పేర్కొంది. సరికొత్త రాజకీయ వ్యవస్థ, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందించడం, సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా జనసేన ఏర్పాటైందని ఆ దిశగా పార్టీని నడిపించేలా కమిటీలు ఉంటాయని తెలిపింది. ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి ప్రక్షాళనపై దృష్టిపెట్టినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధిలోనూ కమిటీలు ఏర్పాటుచేసి, పార్టీ బలోపేతానికి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు నేతలు వివరించారు.

Last Updated : Jun 24, 2019, 3:32 AM IST

ABOUT THE AUTHOR

...view details