అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేత పనులను మంత్రి బొత్స సత్యనారాయణ పర్యవేక్షించారు. అక్రమ కట్టడాలు కనుకనే కూల్చేస్తున్నామని తెదేపా నేతలు ఈ అంశంపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఉండాలా...లేక ఖాళీ చేయాలా అనే విషయాన్ని ఆయనే నిర్ణయించుకోవాలని సూచించారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
ఆ ఇంట్లో ఉండాలో లేదో చంద్రబాబే తేల్చుకోవాలి: మంత్రి బొత్స - amamravathi
అక్రమ కట్టడం కాబట్టే ప్రజావేదికను కూల్చివేస్తున్నామని..దీనిపై తెదేపా నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. కూల్చివేత పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
మంత్రి బొత్స