'మోదీ మీకు 3రోజులే గడువు'
తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకే దిల్లీకి వచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర పెద్దలు తమ తప్పులు తెలుసుకుని ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్మపోరాట వేదికపై చంద్రబాబు
ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయపోరాటం తప్పనిసరి అవుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మాట నిలబెట్టుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసేవరకు పోరాటం ఆగదని సీఎం తెలిపారు.
Last Updated : Feb 11, 2019, 1:17 PM IST