విభజనతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీనివాసులు రెడ్డి మంగళవారం లోక్సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక వనరులున్నాయన్న ఎంపీ... వాటిని ఉపయోగించుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అభ్యర్థించారు. 974 కిలోమీటర్ల తీరప్రాంతం కలిగిన ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ అభివృద్ధికి సహరించండి: మాగుంట - MP Magunta Srinivasulu Reddy
విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభలో మాట్లాడిన ఆయన... రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ప్రజలు నష్టపోయారని పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధికి సహరించండి: మాగుంట