ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నరసింహన్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకే విమానంలో విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ హస్తినకు వెళ్లడంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దీనిపై మరికొద్ది గంటల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి. 30న రాత్రి ఏడు గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నరసింహన్, కేసీఆర్, జగన్కు ఆహ్వానం అందింది.
కలిసే హస్తినకు గవర్నర్, కేసీఆర్, జగన్..! - MODI
మోదీ ప్రమాణ స్వీకారానికి గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్ ఒకే విమానంలో వెళ్లనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
KCR_JAGAN_GOVERNER_IN_ONE FLIGHT
మే 30న మధ్యాహ్నం అమరావతిలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి నరసింహన్, కేసీఆర్ హాజరవుతున్నారు. అనంతరం గవర్నర్, జగన్ కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేసీఆర్ కూడా వెళ్లాలనుకుంటే ముగ్గురూ ఒకే విమానంలో వెళ్లే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:కీలక ప్రకటనలకు జగన్ సమాయత్తం..!?