ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి సోమిరెడ్డి సమీక్షకు అధికారుల డుమ్మా! - officials

వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సమీక్షకు అధికారులు హాజరవ్వాలన్న మంత్రి సూచనలు పెడచెవిన పెట్టారు.

మంత్రి సోమిరెడ్డి

By

Published : Apr 30, 2019, 6:04 PM IST

Updated : May 1, 2019, 8:01 AM IST

రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవు అంశంపై వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్షకు ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన ఏర్పాటు చేసిన ఈ సమీక్షకు హాజరు కావాల్సిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మురళీధర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ సమీక్ష రాలేదు. రాష్ట్రంలోని కరవు, అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టంపై సమీక్ష నిర్వహించాలని మంత్రి సోమిరెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 24 తేదీనే ఉన్నతాధికారులకు మంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఇవాళ చిత్తూరు జిల్లాలో నిర్వహించే జిల్లా వ్యవసాయ సమీక్ష నేపథ్యంలో హాజరు కాలేమని ఉన్నతాధికారులు మురళీధర్ రెడ్డి, బి.రాజశేఖర్ మంత్రికి సమాచారం ఇచ్చారు. సచివాలయంలో 2 గంటలపాటు వేచి చూసిన మంత్రి వెనుతిరిగి వెళ్లిపోయారు.

మంత్రి సోమిరెడ్డి
Last Updated : May 1, 2019, 8:01 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details