ఒడిశా తుపాను బాధితులకు ఏపీ ఆర్థిక సాయం - ఆంధ్రప్రదేశ్
ఒడిశా తుపాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయమందించింది. ఈ మేరకు ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఫొని తుపాను వల్ల ఒడిశా కకావికలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను బాధితులకు ఆదుకోవడం మానవత్వమన్నారు. రూ.15 కోట్లను తుపాను బాధితులకు విరాళంగా ప్రకటించారు. విద్యుత్ రంపాలు, సిబ్బందిని ఇప్పటికే...ఒడిశాకు పంపినట్లు తెలిపారు. చెట్ల తొలగింపు పనులు త్వరగా చేయాలని సూచించారు. అన్ని రాష్ట్రాలూ అండగా ఉండాలని కోరారు. తుపాను వల్ల ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని...స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులు ఆదుకోవాలన్నారు. ఒడిశాకు తాగునీరు, ఆహారం, పాలు, కూరగాయలు సరఫరా చేయలని కోరారు.
ఆర్టీజీ సంజీవని..
ఆంధ్రప్రదేశ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఒడిశాకు చేయూతనిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆర్టీజీఎస్ సహకారం తీసుకోమని 3రోజుల క్రితమే ఒడిశా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. సరైన సమాచారాన్ని అందించి...జననష్టాన్ని చాలావరకు నివారించామన్నారు. విపత్తు బాధిత రాష్ట్రాలకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఒక సంజీవని అయ్యిందన్నారు.