ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులు.. 28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు

నీట్​లో అర్హత పొందిన విద్యార్థులు.. వైద్య విద్యకు దరఖాస్తు చేసుకునే తేదీలను వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 22 నుంచి 28 వతేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ అప్పలనాయుడు తెలిపారు.

ntr_health_university_register_about_neet

By

Published : Jun 23, 2019, 7:31 AM IST

Updated : Jun 23, 2019, 1:41 PM IST

అర్హత పొందిన వారు 28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు

నీట్​లో రాష్ట్రానికి సంబంధించి.. 40 వేల 381 విద్యార్థులు అర్హత పొందారు. వైద్య విద్య అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు.. జులై ఒకటో తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ కాలేజీలో సీటు వచ్చిందో విద్యార్థుల సెల్​ఫోన్​కు నేరుగా సందేశం వెళ్తుంది. ఈ ప్రక్రియ అంతా జులై నెలాఖరుకు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆగష్టు ఒకటో తేదీ నుంచి వైద్య విద్యార్థులకు తరగతులు మొదలవుతాయని రిజిస్ట్రార్ తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కౌన్సెలింగ్​లో అమలుచేస్తామని వెల్లడించారు.

Last Updated : Jun 23, 2019, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details