నవ సమాజ నిర్మాణానికి ఓటు ద్వారా తమ వంతు సహకారం అందించాలని భావించారు ఎన్నారైలు. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ఖతర్ వంటి దేశాల నుంచి వేలాది మంది ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తరలివచ్చారు. అమెరికా నుంచి రాజంపేటలోని స్వగ్రామానికి రావడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. కువైట్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి రావడానికి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చును కూడా లెక్కచేయకుండా కేవలం దేశ భవిష్యత్తు కోసం ఓటు వేసేందుకు వచ్చామంటున్నారు ఎన్నారైలు.
ఎన్నికల కోసం ఎల్లలు దాటి...!! - ఎన్నారైలు.
ప్రజాస్వామ్యదేశంలో వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం దేశ విదేశాలనుంచి స్వస్థలాలకు తరలివచ్చారు ఎన్నారైలు. అంతే కాకుండా ఇక్కడ ఉన్న యువతీ యువకులు పోలింగ్ కేంద్రాలకి తరలి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
ఎన్నారైలు