ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం నివాసం వద్ద సందడి

ఓ వైపు కార్యకర్తలు, మరోవైపు ఆశావహుల రాకతో సీఎం నివాసం వద్ద సందడి నెలకొంది. రోజూ వేల మంది ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటున్నారు.

సీఎం నివాసం వద్ద కార్యకర్తల సందడి

By

Published : Feb 27, 2019, 5:42 AM IST

సీఎం నివాసానికి పోటెత్తుతున్న కార్యకర్తలు

అమరావతిలోని చంద్రబాబు నివాసం నిత్యం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం 9 గంట‌లు అయిందంటే చాలు సీఎం నివాసం కోలాహలంగా మారుతోంది. రోజుకి రెండు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై సీఎం స‌మీక్షలు జ‌రుపుతున్నందున కార్యక‌ర్తల తాకిడి వీప‌రీతంగా ఉంది. రోజూ రెండు, మూడు వేల‌మంది ముఖ్యమంత్రిని నివాసానికి చేరుకుని ఏదో ఓ స‌మ‌యంలో చంద్రబాబును క‌ల‌సి త‌మ నాయ‌కుల‌కు టికెట్ లు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఆ నాయ‌కుడిపై అసంతృప్తి ఉన్నా నేరుగా చంద్రబాబు దృష్టికే తీసుకెళ్తున్నారు. అందరి అభిప్రాయాన్ని తెదేపా అధినేత ప‌రిగ‌ణ‌నలోనికి తీసుకుంటున్నారు. ఒక వేళ టికెట్ మార్చితే...ఏ ప‌రిస్ధితుల్లో మార్చాల్సి వ‌స్తుందో క్యాడర్​కు కార‌ణాలు తెలుపుతున్నారు. ఒకే సారి వేల మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వ‌స్తున్నందున వారి వాహ‌నాల‌తో సీఎం నివాసం వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. కనుచూపు మేరంతా వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details