ETV Bharat / state
ఆర్పీ ఠాకూర్ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్ - dgp
రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి గౌతం సవాంగ్ ను డీజీపీగా నియమించింది. ఏసీబీ డైరెక్టర్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ..ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్ ను నియమించింది.


ఆర్పీ ఠాకూర్ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్
By
Published : May 31, 2019, 2:47 AM IST
| Updated : May 31, 2019, 4:38 AM IST
ఆర్పీ ఠాకూర్ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్ ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బదిలీ చేసింది.
ఏసీబీ డైరెక్టర్ బదిలీ..
అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వ బదిలీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించింది. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్ గా కుమార్ విశ్వజిత్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Last Updated : May 31, 2019, 4:38 AM IST