ప్రశాంతంగా నీట్ - కఠినంగా నిబంధనలు.... - నీట్ పరీక్షా
ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రశాంతంగా ముగిసింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతిలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నీట్ ప్రశాంతంగా ముగిసంది. విజయవాడ పరిధిలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా... విద్యార్థులను 12గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. డ్రెస్ కోడ్ సహా నిబంధనలన్నీ అమలు చేశారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.