ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ అవార్డుల పంట - vijayawada
ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోన్న ఏపీఎస్ఆర్టీసీ అద్భుతమైన పనితీరుతో జాతీయ స్థాయిలో అవార్డులను సాధిస్తోంది. 2017 - 18 ఏడాదికి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఇస్తున్న రెండు అవార్డులు కైవసం చేసుకుంది. దేశంలోని ట్రాన్స్ పోర్టు అండర్ టేకింగ్స్ అన్నింటిలోకి అత్యుత్తమ సామర్థ్యం చూపినందుకు ఆర్టీసీకి ఈ గౌరవం సాధించింది.

వాహన ఉత్పాదకతలో అత్యున్నత పనితీరు చూపినందుకు విజయవాడ సీటీ ఆపరేషన్స్‌కు పురస్కారం దక్కింది. మూడువేల బస్సుల కేటగిరిలో అత్యుత్తమ కెఎంపిఎల్ సాధించినందుకు విశాఖపట్నం విన్నర్‌గా నిలిచింది.
న్యూదిల్లీలో జరిగిన ఏఎస్ఆర్టీయూ - 63వ వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ ఎండీ సురేంద్రబాబు ఈ అవార్డులను అందుకున్నారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా జాతీయ స్థాయి అవార్డులు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు సంస్థకు 2014-15 సంవత్సరానికి 4 అవార్డులు, 2016-17 సంవత్సరానికి 2 అవార్డులు లభించాయి. ఇప్పటి వరకు సంస్థ 8 అవార్డులు కైవసం చేసుకుంది.