ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెలవులకు వెళ్లి వస్తూ పెను విషాదం... - 30 మంది

జమ్ముకశ్మీర్​లో ఉగ్రభూతం పంజా విసిరింది. సీఆర్​పీఎఫ్​ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఎక్కువమందిని ఒకేసారి తరలించారన్న అంశంపై విమర్శలొస్తున్నాయి.

సెలవులకు వెళ్లి వస్తూ పెను విషాదం...

By

Published : Feb 15, 2019, 6:44 AM IST

సెలవులకు వెళ్లి వస్తూ పెను విషాదం...
కుటుంబసభ్యులతో సరదాగా గడిపి తిరిగి విధుల్లోకి చేరేందుకు వెళ్తున్న 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. మృతులంతా 76 వ బెటాలియన్​కు చెందిన సిబ్బందే. పాక్​ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్​ ఏ మహమ్మద్​ దాడి చేసింది తామేనని ప్రకటించింది. ఈ సిబ్బందే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసినట్లు పేర్కొంది.

సీఆర్పీఎఫ్​ జవాన్లు వెళుతున్న వాహన శ్రేణిపై ఉగ్రవాదులు శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. 2001లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఆ తరహాలోనే కారుబాంబు దాడి చేశారు ముష్కరులు.

సీఆర్పీఎఫ్​ జవాన్లు 78 వాహనాల్లో ప్రయాణిస్తుండగా పేలుడు పదార్థాలతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ వాహనాల్లో మొత్తం 2500 మందికి పైగా జవాన్లు ఉన్నారు. వీరిలో చాలా మంది సెలవులు ముగించుకొని తిరిగి విధులకు హాజరుకావడానికి వస్తున్నారు. శ్రీనగర్​-జమ్ము జాతీయ రహదారిపై వెళుతున్న జవాన్ల వాహనాలు అవంతిపొరలోని లోటోమోడి ప్రాంతం వద్దకు చేరుకోగానే ఉగ్రవాదులు బాంబులతో నిండిన వారి వాహనాలతో దాడికి తెగబడ్డారు.

దాడి తీరు

జవాన్లు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని బాంబులతో కూడిన కారుతో ఢీకొట్టి ఘాతుకానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. కాల్పులు కూడా జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

సమర్థించుకున్న సైనికాధికారులు

ప్రతి సారి వాహన శ్రేణిలో 1000 మంది జవాన్లు మాత్రమే ప్రయాణించే వారని , కానీ ఈ సారి 2547 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

సాధారణంగా ఇలాంటి ఒక వాహణశ్రేణిలో వెయ్యిమంది వరకు సైనికులు వెళ్తుంటారు. ఇలా ఒకేసారి పెద్ద సంఖ్యలో సైనికులను తరలించటాన్ని సమర్థించుకున్నారు అధికారులు. అయితే సరైన జాగ్రత్తలు, నిబంధనలు పాటించలేదనే విమర్శలొస్తున్నాయి. ఇన్ని వాహనాలు వెళ్తుంటే అందరికీ తెలిసే అవకాశముందంటున్నారు.

జైషేనే దోషి

కాక్రపొరాకు చెందిన అదిలీ అహ్మద్​ బాంబులతో నిండిన వాహనాలను నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఇతను 2018లో జేఈఎంలో చేరాడు. ఘటనకు తామే బాధ్యులమని జైషే మొహమ్మద్​ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. వీడియోను విడుదల చేసింది.

పూర్తిగా ధ్వంసమైన బస్సు

పేలుడు పదార్థాల వల్ల జవాన్లు ఉన్న ఓ వాహనం పూర్తిగా ధ్వంసమై శకలాలు చెల్లాచెదురైపోయాయి. జవాన్ల శరీరాలు, బస్సు తునాతునకలయ్యాయి. వాహణశ్రేణిలోని పలు బస్సులు దెబ్బతిన్నాయి.

" ఇది చాలా పెద్ద వాహన శ్రేణి, సుమారు 2500 మంది జవాన్లు వీటిలో ప్రయాణిస్తున్నారు. పేలుళ్లతో పాటు వాహానాలపై ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపినట్టు సమాచారముంది. " - భట్​నగర్​, సీఆర్పీఎఫ్​ డీజీ

సాయాంత్రానికల్లా గమ్యం చేరాలి

జమ్ము నుండి ప్రారంభమైన ఈ వాహన శ్రేణి సుర్యాస్తమయ సమయానికల్లా శ్రీనగర్​ చేరాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రహదారిపై గత రెండు,మూడు రోజులుగా రద్దీ తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇది ఉగ్రమూకలకు అనుకూమైందని అధికారులు తెలిపారు.

విచారణ జరుగుతోంది...

తీవ్రవాదులను వేటాడడానికి గస్తీ బృందాలను పంపామని , వారు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్​ బృందాలు దాడి జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details