మరీ ఇంత వ్యామోహమా..! - anand babu
వైకాపాకు రాష్ట్రంలోే అధికారం రావడం జరగని పనని నక్కా ఆనందబాబు అన్నారు. తండ్రి చావు అడ్డు పెట్టుకుని జగన్ రాజకీయం చేశాడని దుయ్యబట్టారు.
వైకాపా కు రాష్ట్రంలో అధికారం ఎండమావేనని మంత్రి నక్కాఆనందబాబు వ్యాఖ్యానించారు. దుష్టత్రయంలో కేసీఆర్ ఆలోచనలను జగన్ ఆచరణలో పెడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నిరంతరం అలజడి, అశాంతి తీసుకురావాలని యోచిస్తున్నారని దుయ్యబట్టారు. చింతమనేని 3నెలల క్రితం మాట్లాడిన వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలే అజెండాగా వైకాపా రాజకీయాలు సాగుతున్నాయంటూ విమర్శించారు.
తండ్రి మృతదేహం అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడు కాబట్టే ఆ మాత్రం సీట్లు జగన్ కి వచ్చాయని ఎద్దేవా చేశారు. తండ్రి మృతదేహం చెల్లాచెదురుగా పడిఉంటే సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పదవి, డబ్బు మీద మరీ ఇంత వ్యామోహం ఉన్న వ్యక్తి దేశంలో మరెవరూ లేరంటూ విమర్శించారు. రాష్ట్రానికి ఈ సమయంలో ఏ నష్టం జరిగినా తిరిగి రాదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కుట్రలను ఎండకట్టాలని పిలుపునిచ్చారు.