సీఎం సమీక్షలపై జగన్‌కు ఉలుకెందుకు?: ఆనందబాబు - ఆనందబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసమస్యలపై సమీక్షలు నిర్వహిస్తే వైకాపా నాయకుడు జగన్ ఎందుకు ఉలికి పడుతున్నారని మంత్రి ఆనందబాబు ప్రశ్నించారు. వైకాపా నేతల లేఖలకు ఈసీ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు.

జగన్‌కు ఉలుకెందుకు: మంత్రి ఆనందబాబు
వైకాపా నేతలు వ్యవహారిస్తున్న తీరుపై మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ప్రజాసమస్యలపై సమీక్షలు చేస్తుంటే జగన్ కు ఉలుకెందుకు అని దుయ్యబట్టారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి లేఖలు రాస్తే ఈసీ ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు.