మై ఓట్ క్యూ యాప్...పని చేసిందెక్కడ? - 2019 elections
ఇప్పుడు నడుస్తున్నది యాప్ల ట్రెండ్.. ఎన్నికల సంఘం కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని..పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల కోసం మై ఓట్ క్యూ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఎలాంటి సమాచారం ఇందులో పొందుపరచకపోవడంతో... ఈ యాప్ పనితీరుపై విమర్శలు వచ్చాయి.

పోలింగు కేంద్రం వద్ద క్యూలైన్ లేదనుకున్నప్పుడే ఓటర్లు వెళ్లి వద్దామనుకుంటారు. ఈ నేపథ్యంలో ఓటరు ఆలోచనలకు అనుగుణంగా ఏ పోలింగు కేంద్రంలో ఎప్పుడు ఓటర్ల క్యూ ఎలా తెలియజేసేలా..ఒక యాప్ సిద్ధం చేసినట్లు ఈసీ ప్రకటించింది. దాన్ని వినియోగిస్తూ ఏ పోలింగు కేంద్రం సమాచారమైనా తెలుసుకోవచ్చని, కాళీగా ఉన్న సమయాన్ని గుర్తించి ఓటు వేయవచ్చని తెలిపింది.
మై ఓట్ క్యూ యాప్లో ప్రతి 5 నిమిషాలకు సమాచారాన్ని నవీకరిస్తామని, తాజా పరిస్థితులు తెలుసుకోవచ్చని ఈసీ పేర్కొంది. అసలు ఇలాంటి సమాచారం ఏదీ ఆ యాప్లో పొందుపరచలేదు. ఈ యాప్ వినియోగించిన ఓటర్లకు ఎప్పుడు చూసినా...నో క్యూ యాడెడ్ ఎట్(ఆ సమాచారం ఏదీ ఇందులో పొందుపరచలేదు) అన్న సమాధానమే కనిపించింది. యాప్లో సమాచారం పెట్టినట్లు కనిపించలేదు.