ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..!

సినీ నటుడు మోహన్​బాబు వైకాపా గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్​పాండ్​లో.. పార్టీ అధినేత జగన్ కండువా వేసి స్వాగతించారు.

Mohanbabu joins in YCP

By

Published : Mar 26, 2019, 1:09 PM IST

Updated : Mar 26, 2019, 5:26 PM IST

Mohanbabu joins in YCP
సినీ నటుడు మోహన్​బాబు వైకాపా గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్​పాండ్​లో.. పార్టీ అధినేత జగన్ కండువా వేసి స్వాగతించారు. అనంతరం మాట్లాడిన మోహన్​బాబు... తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. పదవులు కోరుకోకుండానే వైకాపాలో చేరానన్నారు. బంధువు కాబట్టే తాను జగన్ పార్టీలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపాలో చేరేందుకు తనకు ఎవరి అనుమతీ అక్కర్లేదని చెప్పారు.ఫీజు రీయింబర్స్​మెంట్​ సమస్యపై మూడు, నాలుగేళ్లుగా చంద్రబాబుతో మాట్లాడినా... సమస్య పరిష్కారం కాలేదన్నారు.
Last Updated : Mar 26, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details