ఈనెల 20న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా - MLC VOTERS FINAL LIST RELEASES 20th FEBRUARY
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితా ఈనెల 20న విడుదల చేస్తామని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను ఈనెల 20న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. యువ ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించి నమోదు పెంచేందుకు కళాశాలల్లో ప్రచారం చేస్తున్నామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో క్యూ లైన్లతో ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్ పద్ధతి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 350 కంపెనీల పారా మిలిటరీ బలగాలు పంపాలని పోలీస్ శాఖను కోరినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో మొత్తం మీద 3 లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
TAGGED:
MLC VOTERS LIST