సీపీఎస్ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ రామకృష్ణ - krishna
సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవించారు.
జగన్ హామీతో సీపీఎస్ ఉద్యోగులంతా ఏకపక్షంగా జగన్‌కే ఓట్లు వేశారని ఎమ్మెల్సీ రామకృష్ణ గుర్తు చేశారు. సీపీఎస్పై చంద్రబాబును విమర్శించినందుకు కొందరు సస్పెన్షన్‌కు గురైనా లెక్కచేయలేదని గుర్తు చేశారు. 2 లక్షల సీపీఎస్ ఉద్యోగులు ఓట్లు వేయడం వల్లే వైకాపా అధికారంలోకి వచ్చిందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఎస్ రద్దుపై పరిశీలిస్తామని మంత్రి బుగ్గన చెబుతున్నారని... దీనిపై నియమించిన మంత్రుల కమిటీకి నిర్ణీత కాలవ్యవధి ఎందుకు లేదని ప్రశ్నించారు. నెలరోజుల్లో కమిటీ అధ్యయనం పూర్తి చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 390 అధికరణ ప్రకారం ఉద్యోగుల సర్వీసులు అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.