రాష్ట్ర బడ్జెట్లో విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం దక్కడంపై ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, కత్తి నరసింహా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన పథకాలకే ఎక్కువ నిధులు కేటాయించారని... పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1500 కోట్లు సరిపోవని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల బలోపేతానికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోర్టుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
వర్సిటీల బలోపేతానికి చర్యలేవి: బాల సుబ్రమణ్యం - ap Budget
బడ్జెట్లో విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం దక్కడంపై ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, లక్ష్మణరావు, కత్తి నరసింహా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజధాని, పోర్టుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయపడ్డారు.
బాల సుబ్రహ్మణ్యం