తెదేపా మద్దతుదారుల ఓట్ల తొలగింపు అంశంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ ముఠా డైరెక్షన్‌లో దొంగబ్బాయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ వైకాపా నాయకుడు జగన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రజాక్షేత్రంలో తెదేపానుఎదుర్కోలేక వైకాపా దిగజారుడు పనులు చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కుట్ర చేస్తున్న వైకాపాను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు.జగన్‌కు కేడర్ లేదని.. ఆయన్ను అడ్డదారిలో ముఖ్యమంత్రిని చేయాలని ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మోదీని నియంతగా వ్యాఖ్యానించిన లోకేష్.. జగన్‌ను ఫ్యాక్షనిస్టుగా, కేసీఆర్‌ను దొరగా అభివర్ణించారు. వారి యాక్షన్‌కు ఆంధ్రా ప్రజలు రియాక్షన్ ఇస్తారని స్పష్టం చేశారు.
'మోదీ సమేత కల్వకుంట్ల జగన్' - ఓట్ల గల్లంతు
తెదేపా మద్దతుదారుల ఓట్ల తొలగింపు అంశంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కుట్ర చేస్తున్న వైకాపాను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు.
కొందరు.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రల సమాచారం దొంగిలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలపై తెలంగాణ పోలీసులతో దాడులు చేయించారన్నారు. ''ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం, మోడీ సమేత కలువకుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?'' అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక, కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేక, కుయుక్తులతో అమరావతి నిర్మాణాన్ని ఆపలేక, ముగ్గురు మోడీలు ఒక్కటై దాడులు చేస్తున్నారని లోకేష్ఆరోపించారు.