స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.శ్రీకాంత్... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సచివాలయంలో సమావేశమయ్యారు. నిరుద్యోగుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పేందుకు అవసరమైన వసతులు, కళాశాలలు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలపై అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు.
"నియోజకవర్గానికో నైపుణ్య శిక్షణా కేంద్రం" - Mekapati Gowtham Reddy
భవిష్యత్తులో యువతకు ఉద్యోగావకాశాలు పెంచడమే లక్ష్యంగా... ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగం పొందేందుకు అవసరమైన కోర్సులను అందించే నియోజక వర్గానికి ఓ నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి
పరిశ్రమలతోనే యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించే ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. లేనిపక్షంలో నైపుణ్య శిక్షణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనుందని స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్న హామీని త్వరలోనే నెరవేర్చేలా... పట్టుదలతో ముందుకెళ్లాలని మంత్రి మార్గనిర్దేశం చేశారు.
ఇదీ చదవండీ...మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ఉత్తర్వులు