వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజలందరికీ మంచినీరు : మంత్రి బొత్స - bosta
తాగునీటి సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. తమ నియోజకవర్గాల్లో నీటి సమస్యపై విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కొత్తగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ తాగునీటి సదుపాయం కల్పించటమే లక్ష్యమని పేర్కొన్నారు.
ap minister
కొత్తగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి...రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం అందేలా చర్యలు చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.శాసనసభలో నిమ్మల రామానాయుడు,ముదునూరి ప్రసాదరాజు,కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి...తమ నియోజకవర్గాల్లో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.దీనికి సమాధానమిచ్చిన మంత్రి బొత్స...రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.