ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు నివాసమూ అక్రమ కట్టడమే: మంత్రి అనిల్ - yanamala

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం తుగ్లక్ చర్య అని యనమల విమర్శించటంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. అనుమతులు లేకుండా మీ ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక, చంద్రబాబు నివాసాన్ని ఎలా నిర్మించారని ప్రశ్నించారు.

అనిల్ కుమార్ యాదవ్

By

Published : Jun 26, 2019, 6:51 AM IST

చంద్రబాబు నివాసమూ అక్రమ కట్టడమే: మంత్రి అనిల్

అక్రమ కట్టడం కాబట్టే ప్రజావేదికను కూల్చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌ అన్నారు. ప్రజావేదికను కూల్చేయాలన్న జగన్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్య అని యనమల ఎద్దేవా చేయటండపై అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. ప్రజావేదికకు సంబంధించి భవన ప్రణాళికను గత ప్రభుత్వం నిర్దేశిత అధికారులకు సమర్పించారా అని యనమలను ప్రశ్నించారు. ఆక్రమ స్థలాల్లో ప్రభుత్వ కట్టడాలు ఉండకూడదని తెలీదా అని ప్రశ్నించారు. పోలవరాన్ని కూల్చేస్తారా అని యనమల విమర్శించడాన్ని దుయ్యబట్టారు. పోలవరం అక్రమ ప్రాజెక్టు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అనిల్ వివరించారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమేనని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details