కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘోర దుర్ఘటన షాక్కు గురి చేసిందని ట్వీట్ చేశారు. నిశ్చితార్థానికి వెళ్లొస్తుండగా ఇలా జరగడం బాధాకరమని... మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఎస్పీ ఫకీరప్పతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను వారి స్వస్ధలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.