ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రొడక్షన్.. తెరాస డైరెక్షన్‌! - కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందన

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందన ట్విట్టర్​లో స్పందించారు. వైకాపా ప్రొడక్షన్, తెరాస డైరెక్షన్‌లో తెదేపా డేటా చోరీ జరిగిందని లోకేశ్‌ ఆరోపించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందన

By

Published : Mar 4, 2019, 6:17 PM IST

Updated : Mar 4, 2019, 6:51 PM IST

తెరాసపార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడుకేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ట్విట్టర్​లో స్పందించారు. కేసీఆర్, జగన్ కలిశారనే విషయంకేటీఆర్ మాటల్లో మరోసారి స్పష్టమైందని ఆయన అన్నారు. వైకాపా ప్రొడక్షన్, తెరాస డైరెక్షన్‌లో తెదేపా డేటా చోరీ చేశారని లోకేశ్‌ విమర్శించారు. డేటా చోరీ చరిత్ర వైకాపాదేనని,బలమైన కార్యకర్తలున్న పార్టీ తెదేపాదని ఆయన అన్నారు. జగన్ హైదరాబాద్​లో ఉంటూ తెరాస సాయంతో ఏపీలో అలజడికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.అమెరికాలో పర్స్‌ పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా
?లేదా హైదరాబాద్‌లో చేస్తారా? అని ప్రశ్నించారు. అదేవిధంగాఏపీ డేటాపై ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలని తెలియదా ? అని అన్నారు.
Last Updated : Mar 4, 2019, 6:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details