ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పెరగనున్న వైద్యవిద్య సీట్లు - వైద్యవిద్య

రాష్ట్రంలోని వైద్యవిద్య కళాశాలల్లో సీట్లు పెరగనున్నాయి. ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి సానుకూల సంకేతాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి సీట్ల పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పెరగనున్న వైద్యవిద్య సీట్లు

By

Published : May 14, 2019, 10:35 PM IST

రాష్ట్రంలో పెరగనున్న వైద్యవిద్య సీట్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెరగనున్నాయి. అనంతపురం, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 సీట్ల చొప్పున పెరగనున్నాయని తెలుస్తోంది. జాతీయ వైద్యమండలి నుంచి ఆమోదం లభించబోతుందని డీఎంఈ బాబ్జి తెలిపారు. ఎంసీఐ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నట్లు వివరించారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం 150 సీట్లున్నాయి. మరో 50 సీట్లు పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కళాశాలలో మౌళిక వసతులు పూర్తిస్థాయిలో లేకపోవటంతో... అనుమతి లభించే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

విజయనగరం, ఏలూరు ఆసుపత్రుల్లో 2020-21 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అందుకు అనుగుణంగా వైద్యవిద్య అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చేందుకు... ఒక్కొక్క కాలేజీలో రూ.220 కోట్లు దశల వారీగా ఖర్చు చేయనున్నారు. కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ కింద... ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలలో ఎంబీబీఎస్​లో పది శాతం వంతున సీట్లు పెంచేందుకు ఎంసీఐ వైద్య విద్య అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరింది.

ABOUT THE AUTHOR

...view details