ETV Bharat / state
హోదా ఇవ్వాల్సిందే.. హామీ తీర్చాల్సిందే: మన్మోహన్ - dharamaporata deeksaha
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని స్పష్టం చేేశారు. కేంద్రం ఏపీ ప్రజల డిమాండ్‌ను గౌరవించాలన్నారు.
దిల్లీ ధర్మపోరాట దీక్షలో మన్మోహన్, చంద్రబాబు
By
Published : Feb 11, 2019, 12:15 PM IST
| Updated : Feb 11, 2019, 1:14 PM IST
దిల్లీ ధర్మపోరాట దీక్షలో మన్మోహన్, చంద్రబాబు రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా.. దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌కు వెళ్లి చంద్రబాబుతో కలిసి వేదికపై కూర్చున్నారు. పార్లమెంటు సాక్షిగా గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాల్సిందే అని స్పష్టం చేశారు. విభజన సమయంలో ఏపీకి హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు సమయం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన విషయాన్ని నొక్కి చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, డిమాండ్లను గౌరవించాలని కేంద్రానికి మన్మోహన్ హితవు పలికారు. Last Updated : Feb 11, 2019, 1:14 PM IST