ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకు మామిడి పండ్లు - mangoes availabile by online order in vja

మామిడి పండ్లు కొనాలంటే రోడ్డెక్కాల్సిందే. అసలే ఎండలు. బయటికేం వెళ్తాం.. ఇంట్లోనే ఉండి  అర్డర్ చేసే సౌకర్యం ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. అలాంటి అవకాశమే ప్రజల ముందుకు తీసుకొచ్చింది  రియల్ మిల్క్ సంస్థ.

ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకు మామిడి పండ్లు

By

Published : Jun 12, 2019, 3:46 PM IST

ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకు మామిడి పండ్లు
ఎండా కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లను ముంచెత్తటం సాధారణ విషయం. అక్కడ దొరికే పండ్లలో ఎంతవరకు మేలైన, కార్బైడ్ రహిత పండ్లు ఉన్నాయనేదే అందరి సందేహాం. ఇంటికే డెలివరీ చేసే కార్పొరేట్ కిరాణాషాపుల్లోని పండ్లపైనా ఇదే అనుమానం. ఈ సమస్యలే లేకుండా.. స్వచ్ఛమైన మామిడిని.. సహజసిద్ధంగా మగ్గబెట్టిన పండ్లను రియల్ మిల్క్ సంస్థ జనానికి అందిస్తోంది. విజయవాడ కేంద్రంగా నడిచే ఈ సంస్థ.. ఈ దిశగా రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుంటోంది. ఆన్​లైన్​లో ఆర్డర్ చేస్తే చాలు. తియ్యటి మామిడిపండ్లను నేరుగా ఇంటికే పంపిస్తోంది.
నూజివీడు, ఉలవపాడు రైతులకు రెండింతల లాభం కలిగేలా.. రియల్ మిల్క్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటోంది. పంట మొత్తం ఒకేసారి కాకుండా పక్వానికి వచ్చినవి, పెద్దవి ఎంచుకుని కోస్తారు. ఇలా ఒక చెట్టు నుంచి మూడు నుంచి నాలుగు సార్లు కాయలు కోస్తుంటారు. ఇలా.. రసాయనాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పండ్లు సేకరిస్తారు. ప్రత్యేక అట్ట పెట్టెల్లో ప్యాక్ చేసి దూర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారికి నేరుగా ద్విచక్ర వాహనంపై డెలివరీ బాయ్స్ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆన్​లైన్లో ఆర్డర్ చేసుకున్న వినియోగదారులకు కేజీ మామిడి పండ్లను 120 నుంచి 130 రూపాయలకు విక్రయిస్తున్నారు.
వినియోగదాలకు తమ సంస్థ పై ఏమైనా అనుమానాలుంటే... స్వయంగా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ రోజు మొత్తం ఉండి పరిశీలించాకే ఓ నిర్ణయానికి వచ్చేలా భవిష్యత్తులో ప్రయత్నిస్తామంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details