పోలవరం పేరుతో తెదేపా ఎమ్మెల్యేలు సభను అడ్డుకోవడాన్ని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు తెదేపాకు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో తెదేపా నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. యనమల సహా ఆయన వియ్యంకుడు నామినేషన్ పద్దతిపై పనులు చేపట్టి దోచుకున్నారన్నారు. 15 రోజుల్లో నిపుణుల కమిటీ రిపోర్ట్ నివేదికతో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పారు.
" పోలవరంపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు" - bala raju
పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు తెదేపా నేతలకు లేదని వైకాపా శాసన సభ్యుడు మల్లాది విష్ణు ఆరోపించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతున్న మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే కాంక్ష తెదేపాకు లేదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. తెదేపా ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంలా భావించి, కావాల్సిన కాడికి డ్రా చేసేసుకున్నారని ఆరోపించారు. శాసనసభలో తెదేపా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి...'వ్యాపారవేత్తగా ఎక్కువకు అమ్ముకుంటారు... సీఎంగా బురద చల్లుతారా '