ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన స్పష్టతను స్వాగతిస్తున్నామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేయడం వల్లనే... నేటికీ మాల, మాదిగల మధ్య.. విభేదాలు కొనసాగుతున్నాయన్నారు. ఖైరతాబాద్‌లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. జగన్‌ను ఆదర్శంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలని కోరారు. వర్గీకరణకు మద్దతిస్తున్న చంద్రబాబును రెండు తెలుగు రాష్ట్రాలలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం' - mala_mahanaadu_national_president_on_sc_categorization_ap_cm_desicion
ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతు ఇవ్వబోనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం'