'మహానాయకుడే' మనకు స్ఫూర్తి - మహానాయకుడు
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. భావితరాలకు ఈ చిత్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
!['మహానాయకుడే' మనకు స్ఫూర్తి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2523748-1003-a83d76f1-96ed-4115-8df5-7cfa9a723f8f.jpg)
అమరావతి వేదికగాతెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం పై స్పందించిన ఆయన.. తెదేపా ఆవిర్భావం , ఎదుర్కొన్న సంక్షోభాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా నేటి తరానికి ఎన్టీఆర్ గురించి తెలుస్తుందన్నారు. తెలుగువాడి సత్తా చాటుతూ దిల్లీని గడగడలాడించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటంఓ సంచలనంగా అభివర్ణించారు.మహానాయకుడు సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.