వైకాపా ఒత్తిడితో 'ఓటు పై వేటు వేశారు':లోకేశ్ - 2019 poll in ap
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్రిష్టియన్పేట పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న వారికి... ఓటు వేసే వారికి అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. అందుకు ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని... వైకాపా అభ్యర్థి ఆర్కే, ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. వైకాపా ఒత్తిడితో ఎన్నికల కమిషన్ 'ఓటు పై వేటు వేయడం' ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని లోకేశ్ పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఓటుహక్కు కల్పించాలని నిరసన తెలిపినట్లు ట్వీట్ చేశారు. వైకాపా రౌడీలు తనపై దాడి చేశారని... ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి దాడులకు పాల్పడుతోందన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, ఇద్దరు తెదేపా కార్యకర్తలపై తీవ్రంగా దాడి చేశారన్నారు. ఇందుకేనా జగన్ రావాలి, జగన్ కావాలి అంటున్నారని మండిపడ్డారు.