ఆ సంస్థ.. నాపై కక్షగట్టింది.. అది మళ్లీ రుజువైంది! - మాజీ మంత్రి లోకేశ్
ఓ వార్తా చానల్.. తనపై దుష్ప్రచారం చేస్తోందని.. కక్షగట్టారని ఆరోపించారు మాజీ మంత్రి లోకేశ్. తాను చేయని వ్యాఖ్యలను ఆపాదించి మరీ ప్రసారం చేశారని ఆవేదన చెందారు.

ఓ న్యూస్ చానల్లో ప్రసారమైన కథనంపై మాజీ మంత్రి లోకేశ్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో ఓ మహిళా కార్యకర్త చేసిన వ్యాఖ్యలను.. తాను చేసినట్టు ప్రసారం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసలు తాను ఆ కార్యక్రమానికే హాజరు కాలేదని.. మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకకు హాజరయ్యానని చెప్పారు. తెదేపా ఓటమికి నేతలు, కార్యకర్తలే కారణమని.. తాను వ్యాఖ్యానించకున్నా.. బ్రేకింగ్ వేసి మరీ దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. వారిని తెదేపా నుంచి ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు.