'మీలా... నిధులు మళ్లించలేదు.. జైలుకెళ్లలేదు' - lokesh
శాసనమండలిలో ఉన్నత విద్యామండలి నిధులపై మాటలు తూటాల్లా పేలాయి. గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి సురేష్ ఆరోపణ చేయగా....తాము 16 నెలలు జైల్లో కూర్చోలేదని లోకేష్ బదులిచ్చారు. తమది వెన్నుపోటు పార్టీ కాదని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఎద్దేవాచేశారు.
ap council
గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ శాసనమండలిలో ఆరోపించటంతో...అధికార,ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది.మంత్రి ఆరోపణలకు ఘాటుగా స్పందించిన లోకేష్...తాము16నెలలు జైల్లో ఉండి రాలేదని విమర్శించారు.దీనికి స్పందించిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్...తమది వెన్నుపోటు పార్టీ కాదని బదులిచ్చారు.