'వై..ఛీ...పీ..' - ap latest
వైకాపాపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. జనసేన ప్రచారరథాలు, కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

మంత్రి లోకేశ్
గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తలపై వైకాపా దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైకాపా రౌడీలను బహిష్కరించాలంటూ ట్వీట్టర్లో పేర్కొన్నారు. వై ఛీ పీ అంటూ ఘాటుగా స్పందించారు. మహిళలనీ చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.
Last Updated : Feb 24, 2019, 11:41 AM IST