ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా చేసిన అభివృద్ధి పచ్చబొట్టు లాంటిది: నారా లోకేష్ - బడిబాట

తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పచ్చబొట్టులాంటిదని... స్టికర్లు వేసినంత మాత్రాన పోదని మాజీ మంత్రి లోకేష్ అన్నారు.

తెదేపా చేసిన అభివృద్ధి పచ్చబొట్టులాంటిది: నారా లోకేష్

By

Published : Jul 9, 2019, 9:58 PM IST

తెదేపా చేసిన అభివృద్ధి పచ్చబొట్టులాంటిది: నారా లోకేష్

అధికార ప్రతిపక్షాల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. ప్రభుత్వ తీరుపై.. మాజీ మంత్రి లోకేష్ మరో ట్వీట్ చేశారు. ఐదేళ్లుగా తాము చేసిన అభివృద్ధికి స్టిక్కర్లు అంటించుకుంటూ పోతే... జగన్ ప్రభుత్వానికి వచ్చే అయిదేళ్లూ చాలవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ తీరుపై ఎద్దేవా చేశారు. ఎంత స్టిక్కర్ వేసినా తెదేపా చేసింది పచ్చబొట్ టులాంటి అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. దాన్ని మరుగున పడేయడం జగన్ ప్రభుత్వం వల్ల కాదని తేల్చి చెప్పారు. బడికొస్తా.. సైకిళ్లకు బడిబాట స్టిక్కర్ అంటించిన వీడియోను లోకేష్ ట్విట్టర్ లో పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details