'22 మంది ఎంపీలను గెలిపించిన ప్రజల మెడలు వంచారు' - undefined
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై నారా లోకేశ్ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 22 మంది ఎంపీలను ఇస్తే సాధించింది జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ అంటూ చురకలంటించారు.
22 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో సాధించిందేమిటి? లోకేశ్
ట్విట్టర్ వేదికగా తెదేపా జాతీయ ప్రధానా కార్యదర్శి నారా లోకేశ్ వైకాపాపై వాగ్బాణాలు సంధించారు. కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడ్డారని... ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు గాలి కొదిలారని విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు...కానీ కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో నాడు జగన్ మాట్లాడిన ఓ వీడియోనూ ట్విట్టర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.