ఈ సార్వత్రిక ఎన్నికలు నందమూరి అభిమానులకు కొంత సంతోషాన్ని.. మరికొంత విషాదాన్ని నింపాయి. అంచనాలు తారుమారు చేస్తూ తీర్పు ఇచ్చిన ఓటర్లు... చంద్రబాబు, బాలయ్యకు గెలుపు సంతోషం కన్నా... ఓటమి బాధ మిగిల్చారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా... బాలయ్య ఇద్దరు అల్లుళ్లు పరాజయం పొందడం నందమూరి అభిమానుల్లో బాధను పెంచింది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ గెలుపొందగా... రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన నారా లోకేశ్ ఓడిపోయారు.
రెండో అల్లుడు భరత్ విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి పరాజయం పొందారు. కారణాలేవైనా... ఈ ఎన్నికలు నందమూరి ఇంట సంతోషం కన్నా... బాధనే మిగిల్చాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరపాట్లు గుర్తించి... ఇంకో అవకాశాన్ని చేజార్చుకోబోమని అభిమానులు చెబుతున్నారు.