రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. 22న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంది. ఇది ఓటర్లను ప్రభావతం చేసేలా ఇందులో దృశ్యాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చిత్రాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు...లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాలని ఆదేశాలు ఇచ్చారు.తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసే వరకు తీసుకురావద్దని సెన్సార్ బోర్డుకుస్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలు అందుకున్న సెన్సార్ బోర్డు... విషయాన్ని రాంగోపాల్ వర్మకు తెలియజేసింది. ఇదే అంశాన్ని రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తూ చిత్రాన్ని నిర్మించారని సినిమాపైఫిర్యాదు చేసినదేవీబాబు చౌదరి ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం కోర్టులోపిల్ వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.