తెదేపా నుంచి భాజపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ కీలక నేతగా ఉన్న లంకా దినకర్... పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపారు. తన కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇన్ని రోజులు తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయం గూటికి చేరారు.
తెదేపాకు రాజీనామా.. భాజపాలో చేరిక - Lanka Dinakar
రాష్ట్రంలో ప్రతిపక్ష తెదేపాకు మరో కీలక నేత రాజీనామా చేశారు. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయం మర్చిపోకముందే... ప్రస్తుతం తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న లంకా దినకర్ రాజీనామా చేశారు.
తెదేపాకు లంకా దినకర్ రాజీనామా
Last Updated : Jun 26, 2019, 8:53 PM IST