మదురై బెంచ్ తీర్పు...కేంద్రానికి మేలుకోలుపు! - undefined
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగానికి లోబడి ఉంటాయని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడితే... కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటారని చెప్పారు.
గడిచిన నాలుగేళ్లలో గవర్నర్ వ్యవస్థను భాజపా వాడుకుంటుందని... తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అమరావతిలో వ్యాఖ్యానించారు. మితిమీరి.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం తల దూరుస్తోందని మండిపడ్డారు. ఈ విషయాలపై సుప్రీం కోర్టు మెుట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. మదురై హై కోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోనూ.. సాధారణ పరిపాలనలో వేలుపెట్టే హక్కు సీఎస్‌కు హక్కు లేదన్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆక్షేపణ పెడితే అభ్యంతరం లేదన్నారు.
TAGGED:
లంకా దినకర్