'త్వరలోనే పార్లమెంట్ పరిధిలో కొత్త జిల్లాలు' - సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
త్వరలోనే రాష్ట్రంలో భూముల రీసర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, కొత్త జిల్లాలను పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పిల్లిసుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
అమరావతిలోని ఉండవల్లి వేదికగా సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సమాజంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రిపిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో భూములు రీసర్వే చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, కొత్త జిల్లాలను పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. పరిపాలన బాగున్నప్పుడే పేదరికం తొలగిపోతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.