తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సరళిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ వెంటే ఉన్నారన్నారు. తెలంగాణలో కారు జోరు కొనసాగుతుందని చెప్పారు. ఏపీలో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమే అన్నారు. తన బృందం నిర్వహించిన సర్వే ఫలితాలను రేపు సాయంత్రం తిరుపతిలో వెల్లడిస్తానన్నారు.
సైకిల్ పైనే ఆంధ్రా ప్రజల సవారీ: లగడపాటి - jagan
తెలుగు రాష్ట్రాల ఎన్నికల సరళిపై ఆంధ్రా ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన అంచనాలు వెల్లడించారు. ఆంధ్రా ప్రజలు మరోసారి సైకిల్ పైనే సవారీ చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కారుపైనే విశ్వాసం ఉంచినట్టు తెలిపారు.
తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న ప్రాంతం.. అందుకే అక్కడి ప్రజలు కారు ఎన్నుకున్నారు.. ఏపీ లోటు బడ్జెట్ ప్రాంతం కావున ఇక్కడి ప్రజలకు సైకిలే మార్గమైంది. ఇరుప్రాంత ప్రజలు వారి ఆలోచనలకు అనుగుణంగా కావాల్సిన వాహనం ఎక్కారు. ఈసారి మూడో పార్టీ ఉన్నందున 2 ప్రధాన పార్టీలకు ఓటింగ్ శాతం తగ్గుతుంది. గతంలో కంటే ఈసారి ఇరు ప్రధాన పార్టీలకు ఓటింగ్ శాతం తగ్గుతుంది.- లగడపాటి రాజగోపాల్
జనసేన సాధించబోయే ఫలితాలపైనా తన అంచనాలు వెల్లడించారు.. లగడపాటి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడైన పవన్ కల్యాణ్.. అన్న కంటే కాస్త తక్కువగానే ఫలితాలు సాధిస్తారని చెప్పారు. అయినా... పవన్ కల్యాణ్ కచ్చితంగా శాసనసభలో అడుగుపెడతారని స్పష్టం చేశారు. ఈసారి మూడో పార్టీ పోటీలో ఉన్నందున2 ప్రధాన పార్టీలకు ఓటింగ్ శాతం తగ్గుతుందన్నారు.