నా విశ్వసనీయతకు ఇది చివరి పరీక్ష: లగడపాటి - lagadapati surveys
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ.. లగడపాటి రాజగోపాల్.. ఎన్నికల ఫలితాల సందర్భంగా తాను చేయించిన సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Lagadapati on his surveys
ఎన్నికల సరళిపై తన వ్యక్తిగత అంచనాలేంటో చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫలితాల అంచనాలు తప్పడంపై.. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పారు. ఒకసారి తప్పితే మామూలే అనుకోవచ్చన్న లగడపాటి.. రెండోసారీ అంచనాలు తప్పితే అది ఆలోచించాల్సిన విషయమే అన్నారు. ఎన్నికల ఫలితాలపై నిర్వహించే సర్వేల్లో.. తన విశ్వసనీయతకు ఇది చివరి పరీక్షగా తాను భావిస్తున్నట్టు తేల్చి చెప్పారు.