ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోహన్​బాబు ఆరోపణలపై చర్చకు సిద్ధం'

'ఉచిత విద్యను అందిస్తున్నామనే సాకుతో మోహన్​బాబు విరాళాలు తీసుకుంటున్నది నిజం కాదా? ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్ పొందుతూ 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అని ప్రచారం చేసుకుంటున్నారు': కుటుంబరావు

కుటుంబరావు వర్సెస్ మెహన్ బాబు

By

Published : Mar 23, 2019, 4:16 PM IST

Updated : Mar 23, 2019, 4:23 PM IST

అమరావతిలో కుటుంబరావు మీడియా సమావేశం
ఫీజు రీయింబర్స్​మెంట్​పై మోహన్​బాబుఅసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. మోహన్​బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ సంస్థ యాజమాన్యం చేసిన తప్పుల వల్లే... విద్యార్థులు ఫీజు రీయింబర్స్​మెంట్​కు అనర్హులయ్యారని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. మోహన్​బాబు విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన 6 కోట్ల రూపాయలలో... 5 కోట్ల రూపాయలు ఈ కోవకు చెందినవేనని స్పష్టం చేశారు. ఉచిత విద్యను అందిస్తున్నామనే సాకుతో మోహన్​బాబు విరాళాలు తీసుకుంటున్నది నిజం కాదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్ పొందుతూ 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మోహన్​బాబు చేస్తున్న ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని సవాల్​ చేశారు. ముసుగు తీసి వైకాపాకు ప్రచారం చేస్తున్నానని మోహన్​బాబు చెప్పాలన్నారు. అనవసర ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
Last Updated : Mar 23, 2019, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details