వీవీ ప్యాట్స్ వచ్చేందుకు చంద్రబాబే కారణమని మాజీ సీఈసీ ఎస్.వై. ఖురేషి చెప్పారు. 'భారత్లో ఎన్నికల విధానం - జవాబుదారీతనం'పై దిల్లీ ఐఐసీలో నిర్వహించిన సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, పలువురు ప్రముఖులతో కలిసి ఆయన హాజరయ్యారు.
చంద్రబాబు చెప్పాకే వీవీ ప్యాట్లు తెచ్చాం: ఖురేషి
చంద్రబాబు సలహాతోనే వీవీ ప్యాట్లు తేవాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని మాజీ సీఈసీ ఎస్.వై.ఖురేషి అన్నారు.
ఐఐసీ సమావేశంలో ఖురేషి, చంద్రబాబు
'నేను సీఈసీగా ఉన్నప్పుడు ఎన్నికల్లో సంస్కరణలపై నిర్ణయాలు తీసుకునేందుకు 2010లో అఖిల పక్ష సమావేశం నిర్వహించాను. ఎన్నికల విధానంలో సాంకేతికత తేవాలని చెప్పింది చంద్రబాబే. ఆ రోజు సమావేశానికి చంద్రబాబు వెంట చౌతాాలా, లాలూ వచ్చి ఈసీని కలిశారు. వీవీ ప్యాట్ అంశంపై వివిధ పార్టీ నేతలతో మాట్లాడా. అందరూ చంద్రబాబు చెప్పిందే తమకు ఆమోదమని చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో ఆనాడు ఈసీ ఏకీభవించి వీవీ ప్యాట్లు తేవాలని నిర్ణయించాం' అని ఖురేషి వెల్లడించారు.