వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికగా భర్తీ చేయండి: కొణతాల - konathala write letter to cm jagan
గ్రామ వాలంటీర్ల నియామక విషయంలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ మంత్రి కొణతాల లేఖ రాశారు.
konathala write letter to cm jagan
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లేఖ రాశారు. గ్రామవాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల భర్తీ మార్గదర్శకాల్లో మెరిట్ ప్రస్తావన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వూ ప్రాతిపదికనే నియామకాలు చేపడుతున్న కారణంగా.. వైకాపా కార్యకర్తలకే పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నియమాన్ని సవరించాలని లేఖలో కోరారు.
Last Updated : Jun 23, 2019, 10:59 AM IST